ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు ఆహ్వానం
15-07-2026 09:19 AM
గరిడేపల్లి, జులై 14,(విజయ క్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ బైపిసి కోర్స్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల స్పెషల్ ఆఫీసర్ వై. శైలజ తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2026 - 2027 సంవత్సరానికి గాను స్పాట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయని అర్హులైన బాలికలు దరఖాస్తు నేరుగా వచ్చి అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయని స్పాట్ అడ్మిషన్ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ముందుగా వచ్చిన వారికి సీటు కేటాయించబడుతుందని తెలిపారు. అర్హులైన బాలికలు సర్టిఫికెట్స్ తో విద్యాలయానికి వచ్చి సంప్రదించాలని కోరారు.






