19 May, 2026 | 3:58 AM

మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం

19-05-2026 01:30 AM

భారత ప్రధానిగా అరుదైన ఘనత

స్టాక్‌హోం, మే 18: భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనత సాధించారు. స్వీడన్ అత్యున్నత పురస్కారమైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్, కమాండర్ గ్రాండ్ క్రాస్’ను సోమవారం మోదీ అందుకున్నారు. ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ ఆధ్వర్యంలో గోథెన్‌బర్గ్‌లో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. మోదీ అంతకు ముందు రెండు దేశాల వాణిజ్య సంబంధాలపై స్వీడన్ ప్రధాని ఉల్ఫ్‌తో భేటీ అయ్యారు.

ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), గ్రీన్ ట్రాన్సిషన్, గ్రీన్ హైడ్రోజన్, రక్షణ రంగాల బలోపేతం విషయంలో పరస్పర సహాయ సహకారాలపై చర్చలు సాగాయి. అలాగే, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్‌తోనూ మోదీ భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు యూరప్ దేశాలు ముందుకు రావాలని ఆహ్వానించారు. మోదీ అనంతరం స్వీడన్ పర్యటన ముగించుకుని నార్వే రాజధాని ఓస్లో చేరుకున్నారు.