5 August, 2026 | 9:50 AM

జీఎస్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు.!

05-08-2026 08:48 AM

- గోల్డ్, క్లాత్ మర్చంట్, రైస్ మిల్స్ రికార్డులు, బిల్లుల తనికీలు.

- జీఎస్టీ ఎగవేతపై ఆగ్రహం. 

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలో మంగళవారం జిల్లా కమర్షియల్ టాక్స్ (GST officials) అధికారులు బంగారం, బట్టల దుకాణాలు, షోరూం, రైస్ మిల్స్ లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పన్ను చెల్లింపులు, బిల్లులు, కొనుగోలు, అమ్మకాల లావాదేవీలకు సంబంధించిన రికార్డులను కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కృష్ణ వర్ధన్ రెడ్డి బృందం క్షుణ్ణంగా పరిశీలించారు. 

నిబంధనలను ఉల్లంఘించిన దుకాణాలకు 20వేల పెనాల్టీ విధించడంతోపాటు మరొ రెండు దుకాణాలకు 40వేల చొప్పున నోటీసులు జారీ చేశారు. 25 లక్షల పాత బకాయిలను వసూలు చేస్తూ డిఫాల్ట్ రైస్ మిల్లులోను తనిఖీలు నిర్వహిస్తూ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీలతో జిల్లా కేంద్రంలోని పలు వ్యాపారులు అప్రమత్తమై దుకాణాలను మూసి ఉంచడంపై చర్చకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ప్రారంభించిన బంగారం దుకాణంలోనే నిబంధనలు ఉల్లంఘించారని ఫైన్ విధించినట్లు తెలిసింది.