గిరిజన ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ
(నూగూరు) వెంకటాపురం / జూన్ 30 (విజయ క్రాంతి):-మండలంలోని లక్ష్మీనగరం గిరిజన ఆశ్రమ పాఠశాలను స్థానిక తహసిల్దార్ ఎం వేణుగోపాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మొత్తం 325 మంది విద్యార్థులు ఉండగా,143 మంది మాత్రమే హాజరవడం పట్ల ఆరా తీశారు.182 మంది గైర్హాజరయ్యారు. కుటుంబాల్లో శుభకార్యా లు, ఇతర వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు రాలేదని సిబ్బంది వివరించారు.
అనంతరం మధ్యాహ్న భోజనశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను, మెనూను తహసీల్దార్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. హైస్కూల్కు మంజూరైన 18 టాయిలెట్ల.నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.






