21 August, 2026 | 2:45 PM

ఢిల్లీలో రాహుల్ గాంధీ మెరుపు ధర్నా

21-08-2026 01:30 PM

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi Protest) మరోసారి మెరుపు ధర్నా చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లోని డీసీపీ కార్యాలయం(DCP officeబయట ధర్నాకు దిగారు. గత నెలలో జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలో పెల్లెట్ గన్ (pellet gun)  గాయాలపాలైన సాహిల్ లోచవ్‌తో కలిసి రాహుల్ గాంధీ డీసీపీ ఆఫీసుకు వెళ్లారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ(Rahul Gandhi) డిమాండ్ ను పోలీసులు తిరస్కరించారు. ఈ నెల 17న మెయిల్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు అధికారి పేరు, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వట్లేదని రాహుల్ అసహనం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు కదిలేదే లేదని రాహుల్ అక్కడే కూర్చున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. లోచవ్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయాలని రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ కుమారి సెల్జా కూడా వారితో పాటు ధర్నాలో పాల్గొన్నారు.