23-02-2026 12:57:21 PM
న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) లడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో(Supreme Court) ఊరట లభించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ పై విచారణ జరిపింది. సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్(Subramanian Swamy petition) ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కల్తీ నెయ్యి కేసు ఏకసభ్య కమిషన్ ను సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని సుప్రీం సూచించింది.
సిట్ నివేదిక(SIT Report) మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేస్తూ తీర్పు వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఓవర్ లాపింగ్ కిందకు రాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. పాలనాపరమైన లోపాలు గుర్తింపునకు ఏర్పాటు చేసిందని సీజేఐ ధర్మాసనం తెలిపింది. రాజ్యాంగ పదవుల్లోని వారు ఈ అంశంపై మాట్లాడకుండా నిలువరించాలని సుబ్రహ్మణ్య స్వామి(Subramanian Swamy) తరుఫు న్యాయవాది వినతిని ధర్మాసనం తోసిపుచ్చింది. కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభావం చూసే పరిస్థితి ఎక్కడిదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం సిట్ దర్యాప్తునకు వ్యతిరేకం కాదని సుప్రీం తెలిపింది. పిటిషనర్ వ్యక్తం చేసిన అనుమానాలకు ఆధారాలు లేవని కోర్టు వెల్లడించింది. రెండు కార్యక్రమాలు చట్టప్రకారం కొనసాగాలని ధర్మాసనం ఆదేశించింది.