15 June, 2026 | 3:33 PM

Breaking News

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అర్ధాంతరంగా నిలిపివేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి   •   ఓట్ చోరీ, సీట్ చోరీ చేసేది కాంగ్రెస్సే: రామచందర్‌రావు   •   ప్రైవేట్ స్కూల్ బస్సులు తనిఖీ   •   కిరాతకుడుని ఉరితీయాలి..   •   కేటీఆర్ ను కలిసిన పట్టణ అధ్యక్షులు   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు   •   శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం   •   తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •  

ఉత్తమ సేవలతోనే ఉన్నత గుర్తింపు

03-01-2026 12:00 AM

అచ్చంపేట, జనవరి 2: ప్రభుత్వ ఉద్యోగ ఉత్తమ సేవలతోనే ఉన్నత గుర్తింపు లభిస్తుందని అచ్చంపేట ఆర్డిఓ యాదగిరి, డిఎస్పి పల్లె శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మురళి వేరువేరుగా ఆకాంక్షించారు. గతంలో జరిగిన లోపాలను సవరించుకొని ఏడాదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని అభిలాషించారు. టీఎన్జీవో 2026 క్యాలెండర్ను అచ్చంపేటలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వేరువేరుగా ఆవిష్కరించారు.

ముందుగా టీఎన్జీవో నేతలు ఉన్నతాధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఈ ఏడాది సాధించబోయే లక్ష్యాల గురించి చర్చించారు. ఆయాచోట్ల నిర్వచన కార్యక్రమంలో టీఎన్జీవో అచ్చంపేట డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు గణేష్,  హనుమంతు, జిల్లా కార్యదర్శి బాలరాజు ఉపాధ్యక్షుడు విష్ణు, అమృతమ్మ కోశాధికారి పవన్, లోక్య, అల్లాజీ పవన్ విటల్, గోపి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.