3 August, 2026 | 6:34 PM

పార్టీ క్రమశిక్షణకు మారుపేరు సున్నం రాజయ్య: సీపీఎం నేతలు

03-08-2026 05:38 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): ప్రజా క్షేమమే ధ్యేయంగా భావించి జీవితాంతం ప్రజల మధ్య ఉంటూ పార్టీ క్రమశిక్షణను పాటించిన మహానేత కామ్రేడ్ సున్నం రాజయ్య అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎస్.ఏ. నబీ, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ పేర్కొన్నారు. సున్నం రాజయ్య ఆరో వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో మన్యం మోహన్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ... మూడు పర్యాయాలు భద్రాచలం ఎమ్మెల్యేగా పనిచేసిన సున్నం రాజయ్య పదవులను వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం, భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగించారని కొనియాడారు. అలాంటి మహానేతను పార్టీ కోల్పోవడం తీరని లోటని పేర్కొంటూ, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి కార్యకర్త ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యుడు ఎస్‌కే ఖాదర్, పార్టీ సభ్యులు కోటమ్మ భవాని, వెంకటేశ్వర్లు, నయీమ్, సలీమా, ఎస్. వీరయ్య, నస్రీన్ తదితరులు పాల్గొన్నారు.