21 July, 2026 | 7:14 PM

Breaking News

జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •   ఇల్లందు–బొమ్మనపల్లి ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత   •  

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

21-07-2026 02:48 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం టేకులపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) మండల కార్యదర్శి భూక్య హర్జ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి ఎట్టి నరసింహారావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకుడు డి. ప్రసాద్ మాట్లాడారు.

జంతర్‌ మంతర్ వద్ద గత 15 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడం, బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, విద్యార్థులు, మహిళా విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించడం ఖండనీయమని పేర్కొన్నారు. నీట్ పరీక్షతో పాటు ఇతర ఉద్యోగ నియామక పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆడిమాండ్ చేశారు.

నీట్ పేపర్ లీక్ వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని, ఈ అంశంపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై దమనకాండకు పాల్పడటం సరైంది కాదన్నారు. విద్యార్థుల ఉద్యమాలను అణచివేయాలనే ధోరణిని కేంద్ర ప్రభుత్వం విడనాడాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న నిరసనలపై దాడులు ఆపాలని కోరారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు కలిసి తగిన విధంగా స్పందిస్తారని హెచ్చరించారు.