భానుడి భగభగ
04-04-2026 06:08 PM
మండే ఎండల వేడికి బెంబేలెత్తిన ప్రజలు
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో భానుడి భగభగ ధాటికి ఎండల వేడిమికి శనివారం ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఫలితంగా ఒక దశలో మధ్యాహ్నం ప్రధాన వ్యాపార కూడళ్లలో జనాలులేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోజువారి వాతావరణ మార్పుల్లో భాగంగా పొద్దున 8 వరకు మబ్బులుగాను మధ్యాహ్నం ఎండలు దంచికొట్టడం ఆపై సాయంత్రము వేళల్లో ఉరుములు, ఈదురు గాలులవల్ల వింత అనుబూతులను ఎదుర్కోవడం మండల ప్రజల వంతయింది.




