నూతన పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
రామిడి వెంకట్ రెడ్డి
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణంలోని ముకుంద టాకీస్ హాల్ లో గుర్రం వెంకన్న అధ్యక్షతన కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసే నూతన పార్టీ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని రామిడి వెంకట్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈనెల 25వ తేదీన కల్వకుంట్ల కవిత నూతన పార్టీ ఆవిష్కరణ సభకు సంబంధించిన గోడ పోస్టర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పోస్టర్ లను విడుదల చేసినట్లు తెలిపారు.
అనంతరం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 25వ తేదీన జరగబోయే నూతన పార్టీ ఆవిష్కరణ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు ఎత్తరి గణేష్.కందాడి గౌతంరెడ్డి.మంచాల వంశీ చారి.గిరిశెట్టి రాజు.వరికుప్పల సంతోష్ తదితరు పాల్గొన్నారు.




