మహిళా సమైఖ్య భవనాన్ని ప్రారంభించిన సుడా చైర్మన్
కొత్తపల్లి, మే 11 (విజయ క్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ఖాన్ పేటలో పది లక్షలతో నిర్మించిన మహిళా సమైఖ్య భవనాన్ని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం సంబంధించిన నిధులతో నిర్మించిన మహిళా భవనం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను మహిళా సాధికారత దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తోందని పేర్కొన్నారు. సర్పంచ్ గుర్రం సంధ్య తిరుపతి రెడ్డి ఈ సంఘ భవనం త్వరిత గతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జగన్ మోహన్ రెడ్డి, డీఈ జనార్దన్, ఏఈ సమ్మయ్య, కంరెడ్డి రంరెడ్డి, సాయిని తిరుపతి, సర్పంచులు మోతే ప్రశాంత్ రెడ్డి, బోగొండ ఐలయ్య, కూర నరేష్ రెడ్డి, కామల్ గౌడ్, లక్ష్మి నారాయణ, రాజు, అంజయ్య, బాపురెడ్డి, తిరుపతి ,అంజయ్య, మహిళా సమాఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.






