18 May, 2026 | 11:05 AM

ఆరోగ్యంపై మహిళా పోలీసులు జాగ్రత్త వహించాలి

18-05-2026 12:00 AM

టీపీఎ డైరెక్టర్ అభిలాష బిస్ట్, అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ శోభన కామినేని

విజయవంతమైన ఫైబ్రాయిడ్ రెడ్ స్ట్రెంత్ వాక్

రాజేంద్రనగర్, మే 17 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మహిళా పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్ తెలిపారు. ఆదివారం హైదరాబాదులో నిర్వహించిన ‘ఫైబ్రాయిడ్ రెడ్ స్ట్రెంత్ వాక్’ కార్యక్రమం విజయవంతమైంది.

రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ మహిళా ట్రైనీ అధికారులు, అకాడమీ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం రహేజా మైండ్‌స్పేస్ సమీపంలోని హోటల్ వెస్టిన్ వద్ద నిర్వహించిన ఫైబ్రాయిడ్ రెడ్ స్ట్రెంత్ వాక్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్ మహిళల ఆరోగ్యంపై చైతన్యం కల్పించే లక్ష్యంతో నిర్వహించినట్లు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి హజరైన అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్పర్సన్ శోభన కామినేని జెండా ఊపి అవగా హన రన్‌ను ప్రారంభించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్ట్, డీజీపీ  నాయకత్వంలో అకాడమీ నుంచి యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి అసిస్టెంట్ డైరెక్టర్ రాంబాబు, మహిళా సిబ్బంది, మహిళా ట్రైనీ అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్, సంక్షేమం, సామాజిక అవగాహన కార్యక్రమాల పట్ల తెలంగాణ పోలీస్ అకాడమీ నిరంతరం కట్టుబడి ఉందని అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్‌గార్గ్  పాల్గొన్నారు.