3 August, 2026 | 3:01 PM

ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై డీలర్లకు అవగాహన కార్యక్రమం

03-08-2026 02:09 PM

కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలం దుద్దెడ రైతు వేదికలో ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండపాక మండల వ్యవసాయ అధికారి (ఏవో) శివరామకృష్ణ మాట్లాడుతూ, ఎరువుల బుకింగ్ యాప్ ద్వారా రైతులు సులభంగా ఎరువులను బుక్ చేసుకునే విధానంపై డీలర్లు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. యాప్‌ను ఎలా ఉపయోగించాలి, బుకింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది వంటి అంశాలపై ఉమ్మడి కొండపాక మండలంలోని డీలర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో సిద్ధిపేట జిల్లా మేనేజర్ చంద్రబాబు నాయుడు, కుకునూరుపల్లి మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు, వివిధ ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.