3 August, 2026 | 3:14 PM

కాకతీయ పాఠశాలలో బోనాల పండుగ

03-08-2026 02:37 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని కాకతీయ పాఠశాలలో సోమవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పోతురాజు వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోతురాజు వేషధారణతో విద్యార్థులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

బోనాల పండుగ విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి. పాఠశాల ఆవరణలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల వేడుకలను నిర్వహించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శనలను పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. యాదగిరి, ఇన్‌చార్జ్ పి. అనురాధ లక్ష్మి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు పాల్గొన్నారు.