3 August, 2026 | 2:59 PM

కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

03-08-2026 02:19 PM

మిల్లులో ఉన్న ధాన్యాన్ని  తనిఖీ చేసిన అధికారులు

ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు

సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఓఎస్డి ఆధ్వర్యంలో తనిఖీలు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామ శివారులో రైస్ మిల్ పై సోమవారం సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రైస్ మిల్లులో ఉన్న స్టాక్ ను పరిశీలించారు. సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఓ ఎస్ డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మిల్లులో ఉన్న స్టాక్ ను పరిశీలించారు. ధాన్యం నిలువలను, బియ్యం నిల్వలను పరిశీలించారు. రికార్డుకు ఉన్న వివరాలను స్టాక్ వివరాలను పరిశీలించి సివిల్ సప్లై అధికారులకు నివేదించారు.

రైస్ మిల్ యజమానుల మధ్య  ఇటీవల జరిగిన గొడవ వల్లనే ఫిర్యాదులు చేసుకున్నట్లు సమాచారం. రైస్ మిల్ యజమానుల ఫిర్యాదు మేరకే సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలకు వచ్చినట్లు తెలుస్తోంది. గత 12 సంవత్సరాలుగా తాము ఏ డిఫాల్ట్ చేయలేదని రైస్ మిల్ యజమాని భూమేష్ గుప్తా తెలిపారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయడం వల్లే తనిఖీలకు వచ్చినట్లు తెలుస్తుంది అన్నారు. బిల్లులో స్టాక్ ఉన్నట్లు తెలిపారు. భాగస్వాముల మధ్య వచ్చిన విభేదాలు తో ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం.