calender_icon.png 23 February, 2026 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిశ్చలతలోని విజయం

23-02-2026 02:28:22 AM

పరుగుల కాలంలో పుట్టిన మన జీవితం

విజయాల కొలతలతోనే 

తనను కొలుస్తోంది

సాధించడమే శ్వాసగా మారితే

నిశ్శబ్దం నేరమై కనిపిస్తోంది.

కాని ఆగిన క్షణంలోనే

మనస్సు తన అసలు 

స్వరాన్ని వింటుంది

ఏమీ చేయకపోవడం అలసత్వం కాదు

అది అస్తిత్వాన్ని ప్రశ్నించే విరామం

ప్రపంచం పనిని పూజిస్తే

నిశ్చలభావాన్ని శుద్ధి చేస్తుంది

పరాజయం ఒక ముద్ర మాత్రమే

అది చైతన్యానికి ద్వారం కావచ్చు

కార్యరహిత క్షణాల్లోనే

మన సంబంధాలు అర్థమవుతాయి

లక్ష్యం లేని నిలుపులో

మనసు తన లోతును కొలుస్తుంది

అందుకే ‘లూజర్’ అవడం 

పరాజయం కాదు

బాహ్య గెలుపును దాటి

అంతరంగ విజయం వైపు తిరుగుట