10 April, 2026 | 3:21 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

సూర్యక్షేత్రంలో విద్యార్థుల పూజలు

02-12-2025 12:53 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్ 1: రాష్ట్రంలోని తొలి సూర్యక్షేత్ర మైన తిమ్మాపురంలోని అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి క్షేత్రాన్ని జిల్లా కేంద్రం సూర్యాపేటలోని చర్చి కాంపౌండ్ లో ఉన్న న్యూ మిలీనియం హైస్కూల్ విద్యార్థులు సోమవారం క్షేత్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి క్షేత్ర విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అలాగే క్షేత్రం ఆవరణలోని కార్యసిద్ధి వీర హనుమాన్, శ్రీరామకోటి స్తూపాలను కూడా దర్శించుకున్నారు.  క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్ధన్, ఘనపురం నరేష్, రామచం ద్రయ్య, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్ పాండే పాల్గొన్నారు.