19 August, 2026 | 8:53 PM

శక్తి విలీనం వద్దు.. జీవో 97ను రద్దు చేయాలి

19-08-2026 07:52 PM

హుస్నాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల మానవహారం

హుస్నాబాద్: సాంకేతిక విద్యను ‘శక్తి’ శాఖలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం హుస్నాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో విద్యార్థులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్ విభాగాలను విలీనం చేయడం వల్ల సాంకేతిక విద్యకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ అనంతరం బీటెక్‌లో ప్రవేశానికి సీట్ల సంఖ్య పెంచాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పెంచి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి స్పందించి జీవో నంబర్ 97ను ఉపసంహరించుకుని, సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని విద్యార్థులు కోరారు. సాంకేతిక విద్యను విలీనం చేయడం కంటే ఆధునిక ప్రయోగశాలలు, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ దానిని మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.