అమ్మ ప్రేమలాంటి అంగన్వాడీలో ఆరోగ్యం
కోనరావుపేట,(విజయక్రాంతి): అమ్మ ప్రేమలాంటి అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులకు విద్యతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తున్నాయని భూక్యారెడ్డి తండా గ్రామ సర్పంచ్ బానోత్ నరేష్ నాయక్ అన్నారు.బుధవారం కోనరావుపేట మండలం భూక్యారెడ్డి తండా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ లక్కం సంతోష ఆధ్వర్యంలో బాలలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ నరేష్ నాయక్ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఐసీడీఎస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో అంగన్వాడీ కేంద్రాల్లో బాలలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం, బాలామృతం అందిస్తున్నారని అన్నారు. అలాగే గర్భిణీలు, బాలింతలకు పాలు, గుడ్లు తదితర పౌష్టికాహారాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లి, శిశువుల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నరేష్ నాయక్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు లకావత్ సరిత, సీఏ రాజేశ్వరి, అంగన్వాడీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.






