19 August, 2026 | 8:53 PM

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

19-08-2026 07:49 PM

విద్యార్థులకు యూనిఫామ్ డ్రెస్, షూ లు పంపిణీ

ఘట్ కేసర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేస్తుందని ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్ అన్నారు. బుధవారం ఘట్కేసర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థినుల కోసం అందజేసిన సుమారు 500 యూనిఫామ్ డ్రెస్సులు, షూలను మున్సిపల్ మాజీ చైర్మన్ పావని జంగయ్యయాదవ్, ఘట్కేసర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒక్క ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మాజీ చైర్మన్ పావని యాదవ్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిరాజుద్దీన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, బొక్క సుధాకర్ రెడ్డి, మహిళా నాయకురాలు లావణ్య,  కడుపొల్ల రాజు,  అందెల సాయి యాదవ్, ఉపేందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.