15 May, 2026 | 2:58 PM

Breaking News

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •   ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం   •   ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ   •   చెరువులు వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి   •   నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలి: సీఐ ధనుంజయ్ గౌడ్   •   ఇక OMR పత్రాలు ఉండవు: ఆన్‌లైన్‌లోనే NEET పరీక్ష   •  

కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులు

21-02-2026 01:00 AM

నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 20: రానున్న ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడికీ ప్రయత్నించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ఎంపిటిసి - జడ్పిటిసి ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు పెట్టకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని, బీసీలను ఇంకెన్నిసార్లు మోసం చేస్తారని హెచ్చరించారు.

బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచకుండా పాత పద్ధతిలో 17% తగ్గించి ఎన్నికలకు పోతే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. రాష్ట్రంలో బీసీల తిరుగు బాటు యుద్ధం జరుగుతుందని14 బి.సి సంఘాలు హెచ్చరించాయి. బి.సి ఉద్యమం పల్లె పల్లెకు వెళ్ళి ప్రజా ఉద్యమంగా మారిందని దీనిని ఎవరు అడ్డుకోలేరన్నారు. కోర్టులో కేసు 100% బీసీల పక్షాన రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్దంగానే ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం నాయకులు మేడబోయిన సాయికుమార్ , అనంత్ నాగరాజుగౌడ్, కొంపెల్లి రామన్న గౌడ్, గుండ్ర గణేష్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.