calender_icon.png 13 February, 2026 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి ఆత్మహత్యాయత్నం

13-02-2026 12:03:21 AM

ఘట్‌కేసర్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధి పోచారం డివిజన్ యంనంపేట్‌లోని శ్రీనిధి యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థి రెండవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. పోచారం ఐటి కారిడార్ పోలీ స్‌స్టేషన్ పరిధిలోని శ్రీనిధి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతు న్న విద్యార్థి గంట కళ్యాణ్ (18) కళాశాల రెం డో అంతస్తు నుంచి దూకాడు.

విద్యార్థిని చికి త్స నిమిత్తం మొదట నీలిమ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి షిఫ్ట్ చేశా రు. కుటుంబ సభ్యులను కాలేజీ పిలిచిన సమయంలోనే ఈ సంఘటన జరిగినట్లు తెలిసిం ది. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన కారణాల వివరాలు ఇంకా తెలియరాలేదు.