29 April, 2026 | 7:18 PM

పది ఫలితాల్లో ఎస్ఎన్జిజి నియోజకవర్గంలో టాప్

29-04-2026 06:01 PM

590/600 మార్కులు సాధించిన విద్యార్థిని మోక్ష

అభినందించిన పాఠశాల డైరెక్టర్ మణిమాల

తాండూరు,(విజయక్రాంతి): పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఈ పరీక్ష ఫలితాల్లో వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థ శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాల విద్యార్థిని మోక్ష అత్యధిక మార్పులు సంపాదించి తాండూర్ నియోజకవర్గంలోనే టాపర్ గా నిలిచింది. 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించి  శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాల ప్రతిష్టను మరింత పటిష్టం చేసింది.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మణిమాల మాట్లాడుతూ  ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్పులు సాధించిన T. మోక్ష కు పాఠశాల తరఫున ప్రత్యేక అభినందనలు. విద్యార్థులలో దాగి ఉన్న నైతిక విలువలను బయటికి తీస్తూ. ..క్రమశిక్షణ ..ఆధునిక విద్యను  అందిస్తూ... ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధతో నిష్ణాతులైన ఫ్యాకల్టీతో.. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నత శిఖరాలకు చేర్చేలా కృషి చేస్తున్నామని  ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి వారికి సరైన మార్గదర్శనo. అందించడమే మా లక్ష్యం అని  ఈ ఫలితం మునుముందు ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు ప్రేరణ ఇస్తుందని అన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించేందుకు సహకరించిన ఉపాధ్యాయ బృందానికి తల్లిదండ్రులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.