1 June, 2026 | 2:45 AM

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

01-06-2026 02:00 AM

జిన్నారం/ అమీన్ పూర్, మే 31 : అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెడికల్ డివైస్ పార్క్ పారిశ్రామిక వాడలో తవ్విన క్వారీలో ఫ్రెండ్స్ తో కలిసి ఈతకు వెళ్లిన విద్యార్థి మృత్యువాత పడ్డాడు. బొల్లారం కు చెందిన బెతాల ప్రదీప్ (16) అనే విద్యార్థి నీటిలో మునిగి అనుమానస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.