23 August, 2026 | 8:00 PM

అయ్యప్ప సేవా సమితి ఎన్నిక

23-08-2026 07:03 PM

నిర్మల్ ఆగస్టు 23 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆదివారం అయ్యప్ప సేవా సమితి నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బద్రి శ్రీనివాస్, కార్యదర్శిగా కనపర్తి విగ్నేష్, కోశాధికారిగా కుంటాల సాయినాథ్, గౌరవ అధ్యక్షుడిగా జాప ప్రకాష్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సాదం ఆనంద్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.