విద్యార్థుల యూనిఫామ్ డ్రస్సుల కుట్టడం త్వరలో పూర్తి చేయాలి
ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే యూనిఫామ్ డ్రెస్సులకు కుట్టడం త్వరలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్శి షా అన్నారు. మంగళవారం ఉట్నూర్ నుండి జిల్లా కేంద్రానికి ప్రయాణం చేస్తూ.. మార్గ మధ్యలో గల ఉట్నూర్ మండలం పెరక గూడ లోని ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలోని భాగ్యలక్ష్మి టైలరింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు వడ్డీ లేని రుణం కింద టైలర్ మిషన్లు( కుట్టు మిషన్లు ) సరఫరా చేయాలని ఐకెపి సిబ్బందిని ఆదేశించారు. 15వ ఆగస్టులోగా ఒక జత యూనిఫామ్ డ్రెస్సులను విద్యార్థులకు అందించాలని భాగ్యలక్ష్మి టైలరింగ్ బృందానికి సూచనలు చేశారు. ఆయనతోపాటు ఐ కె పి సిబ్బంది పాల్గొన్నారు.
వికలాంగుల పెన్షన్ అందిస్తా..
మూడేళ్ల క్రితం సదరం సర్టిఫికెట్ పొందిన తోట భాస్కర్ కు వికలాంగుల పెన్షన్ కింద దరఖాస్తులు ఆన్లైన్ చేయాలని పంచాయతీ కార్యదర్శిని జిల్లా కలెక్టర్ రాజర్శి షా ఆదేశించారు. మంగళవారం పెరకగూడెంలో కుట్టు మిషన్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం తోట భాస్కర్ వికలాంగుడు కలిసి తన గోడును విన్నవించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ పెన్షన్ మంజూరు చేస్తానని వికలాంగుడికి హామీ ఇచ్చారు.






