7 April, 2026 | 3:37 AM

ఆరోగ్యకరమైన జీవనానికి ఈట్ రైట్ వాక్

07-04-2026 12:00 AM

కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి) : 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆహార భద్రతపై ప్రత్యేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సర్కిల్లో ఈట్ రైట్ - వాక్ కార్యక్రమాన్ని నిర్వహించగా, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి రాందాస్ చౌరస్తా వరకు  వాకింగ్ కార్యక్రమం నిర్వహించారు.

డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ పై పటిష్ట చర్యలు చేపట్టారు. ఈట్ రైట్ ఫైట్ డీసీజ్, హెల్త్, ఫుడ్ సేఫ్టీ, సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ, ఎడ్యుకేషన్, ఫారెస్ట్, పోలీస్ స్పోరట్స్, ఇరిగేషన్, మత్స్యశాఖ, ఇండస్ట్రీస్ జిల్లా పరిషత్,వివిధ శాఖల జిల్లా అధికారులు వారి సిబ్బంది,  పాల్గొన్నారు. రాందాస్ చౌరస్తాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ హెల్త్ వీక్ కార్యక్రమంపై సుదీర్ఘంగా వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ - 99 రోజుల  కార్యాచరణ లో భాగంగా ఈరోజు నుండి వారం రోజులపాటు హెల్త్ వీక్ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.  జిల్లాలోని ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ర్యాలీని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ హెల్త్ కి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వివిధ విభాగాల్లో పనిచేసే ఉత్తమ వర్కర్ లను గుర్తించి, సత్కరిస్తున్నామన్నారు.

ఏప్రిల్ 8న రక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా సురక్షిత ప్రసవాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డి .సి హెచ్ డాక్టర్ శివ దయాల్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఎఫ్‌ఓ జో.జి, డీఈఓ విజయ, బి డబ్ల్యు.ఓ హేమ భార్గవి, ఇరిగేషన్ ఈ.ఈ శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, క్రీడల నిర్వహణ అధికారి రమేష్, మత్స్య శాఖ అధికారి, మున్సిపాలిటీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఏఎన్‌ఎంలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.