20-02-2026 01:32:30 AM
ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌తో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్ష
ఆదిలాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు వడివడిగా అడుగులు పడుతున్నాయి. జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గాలి మోటర్ కలలు త్వరలో సహకారం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం రాష్ట్ర సచివాలయంలో రోడ్డు,రవాణ, భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టులపై ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్, రైతుల భూముల సేకరణ ప్రక్రియ, ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి పనుల పురోగతి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ ప్రాజెక్టుల అమలుతో జిల్లాలో ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వేగవంతంగా అమలు చేయాలని అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.