20-02-2026 01:34:50 AM
మోర్తాడ్ ఫిబ్రవరి19 (విజయ క్రాంతి): మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో గురువారం రోజు జాతీయ సేవా పథకము ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శీతాకాల శిబిరం మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్, శ్రమదానం కార్యక్రమం, తోపాటు, చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వెంకటేశ్వర దేవాలయము ప్రాంగణము, ప్రధాన వీధులలో శ్రమదానం కార్యక్రమాన్ని వాలంటర్లు నిర్వహిం చారు
ప్రాంగణమంతా శుభపరిచారు. భారతదేశాన్ని తురుష్కుల, అరబ్బుల దండయాత్రల నుంచి కాపాడి దేశ సమైక్యతను, సమగ్రతను పెంపొందించిన గొప్ప మహామేధావి, దేశభక్తుడు శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ అని గ్రామ సర్పంచ్ పుప్పాల నరేష్ కొనియాడారు. శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
దేశభక్తులు చూపిన బాటలో భారత దేశ ఐకమత్యాన్ని పెంపొందించాలని అదేవిధంగా విద్యార్థులలో గ్రామస్తులలో దేశభక్తిని పెంపొందించాలని ప్రోగ్రాం అధికారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మర్రిపల్లి భూపతి అభిలాషించారు ఈ సందర్భంగా విద్యార్థుల వాలంటీర్ల సేవలను గ్రామస్తులు సర్పంచ్, వార్డ్ మెంబర్లు పుర ప్రముఖులు అభినందించారు .ఈ గ్రామం లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని అధికారులను కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీ పెద్దన్న హాజరైనారు. గ్రామ ఉపసర్పంచ్ ,వార్డ్ మెంబర్స్ ,సెక్రెటరీ, యువకులు ,అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.