రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం
29-08-2026 07:33 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శనివారం ఆత్యపాధ్యా అసోసియేషన్ రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ప్రముఖ వ్యాపారవేత్త అల్లుళ్ల మురళీధర్ రెడ్డి, వైద్యులు మనోజ్ భరత్ ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడ పోటీలను ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా అధ్యక్షులు భూమన్న కార్యదర్శి సంజు పిటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






