సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది
25-02-2026 12:00 AM
వేములవాడ, ఫిబ్రవరి 24,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వే ములవాడ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్ ఆది శ్రీనివాస్ను అభినందించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చే స్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై ఆ శీర్వాదం అందించారని విప్ పేర్కొన్నారు. అదేవిధంగా, వేములవాడ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విప్ ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.




