25 February, 2026 | 3:30 PM

27న డ్రైవర్లందరికీ ఉచిత కంటి వైద్య శిబిరం

25-02-2026 12:00 AM

కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్‘ కార్యక్రమంలో భాగంగా, కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో ఈనెల 27న వాహన డ్రైవర్లందరికీ భారీ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు.

మంగళవారం కార్యక్రమానికి సంబందించిన పోస్టర్ ను సీపీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. డ్రైవర్ల భద్రతకు తమ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ‘అరైవ్ అలైవ్‘ చొరవతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్ యంత్రాంగం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

సురక్షిత ప్రయాణానికి స్పష్టమైన కంటి చూపు చాలా ముఖ్యమని తెలిపారు. ప్రైవేట్ వాహనాలు, టిజిఆర్టిసి, ఆటోలు, భారీ వాహనాల డ్రైవర్లందరూ ఈ ఉచిత వైద్య సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. కరీంనగర్, పరిసర ప్రాంతాల్లోని డ్రైవర్లందరూ 27న అస్త్ర కన్వెన్షన్ హాల్కు చేరుకుని, నిపుణులైన వైద్యులచే కంటి పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తు న్నామని సీపీ తెలిపారు. ఈ ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు.