5 August, 2026 | 1:39 PM

ఇంటింటికి మొక్కలు పంపిణీ

05-08-2026 12:52 PM

కల్లూరు, ఆగస్టు 05 (విజయక్రాంతి): కల్లూరు మున్సిపాలిటీ 15వ వార్డు కప్పల బంధం రోడ్డులో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు కౌన్సిలర్ యాసా నాగమణి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఇంటికి మొక్కలు అందజేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్,వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి మాట్లాడుతూ పచ్చదనం పెంపు ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కల్లూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోట్రు అర్జున్ రావు, పట్టణ అధ్యక్షులు షేక్ ఉస్మాన్, యూత్ అధ్యక్షులు ఆళ్లకుంట నరసింహారావు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.