ఇల్లందులో ఎమ్మెల్యే కనకయ్య విస్తృత పర్యటన
- మెగా రక్తదాన శిబిరం ప్రారంభం..
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, చిన్నారితో కలిసి మొక్కను నాటారు.
అనంతరం "మీ ఇంటికి మీ ఎమ్మెల్యే" కార్యక్రమంలో భాగంగా 20వ వార్డులో స్థానిక కౌన్సిలర్ ఎండి జాఫర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి చెక్కులను అందజేశారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తదుపరి అదే వార్డులో ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మాణం పూర్తయిన కొప్పుల కవిత నివాస గృహ గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, "ప్రతి గడపకు ప్రభుత్వ పథకం చేరవేయడం, ఇందిరమ్మ రాజ్యమే ప్రభుత్వ లక్ష్యం" అని పేర్కొన్నారు.
కార్యక్రమాల్లో ఇల్లందు పురపాలక చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియేల్, వైస్ చైర్మన్ పెండేల రాజు, మాజీ చైర్మన్ యదలపల్లి అనసూర్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బోళ్ళ సూర్యం, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గాలి స్వరూప, దిశ కమిటీ సభ్యురాలు బానోత్ శారద, కౌన్సిలర్లు ఎస్‌కే సైదిమియా, అజ్మీర్ వంశీ, చిల్లా విజయభారతి శ్రీనివాస్, మెరుగు కార్తీక్, నీరుడు ఉపేంద్ర, నీలపు రమేష్, కొర్లపాటి శివకిరణ్, కో-ఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి, అజాం, నాయకులు కమల్ కోరి, సదానందం, రవిశంకర్, చెనిగరపు రమేష్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






