30 March, 2026 | 7:40 PM

శ్రీవాణి డిగ్రీ , పీజీ కళాశాలల వార్షికోత్సవ సంబరాలు

30-03-2026 06:09 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్య పల్లిలోని విజయ ఏసి   ఫంక్షన్  హాల్ (ఫోటో ఫామ్)లో సోమవారం  శ్రీవాణి డిగ్రీ, పీజీ  కళాశాల వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక మాట్లాడుతూ... విద్యార్థులకు చదువుతోపాటు అన్ని రకాల  స్కిల్స్ పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలపడం జరిగింది.

డిగ్రీ విద్యార్థులకు చదువుతోపాటు స్కిల్స్ కూడా ముఖ్యం, తద్వారా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ  మాట్లాడుతూ... కళాశాలలో ఎక్కువ మంది విద్యార్థినిలు చదువుతున్నారని, ఆ విద్యార్థినులు తమ కలలు సాకారం చేసుకోవడానికి తగినట్లు పట్టుదలతో కృషి చేయాలని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్  మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు సాధించిన మార్కులు, ఈ విద్యా సంవత్సరం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమాల వివరాలను వార్షిక నివేదిక లో సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా  వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలు గా నిలిచిన విద్యార్థులకు అతిధుల   చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమంలతో ఆహుతులను అలరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బండారి కమలాకర్, బాలసాని శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు  పాల్గొన్నారు,