calender_icon.png 18 February, 2026 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాన్యుడికి మేయర్ పట్టం

17-02-2026 12:39:51 AM

మేయర్‌గా కొలగాని శ్రీనివాస్

డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు

కరీంనగర్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి సామాన్యుడికి దక్కింది. భారతీయ జనతా పార్టీ పక్షాన మేయర్ అభ్యర్ధిగా 2వ డివిజన్ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ పేరును ఖరారు చేసింది. డిప్యూటీ మేయర్ గా మాజీ మేయర్ సునీల్ రావును ఎంపిక  చే సింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఈ మేరకు వారి పేర్లను ఖరారు చే స్తూ లేఖపై సంతకం చేశారు. బీజేపీ లీగల్ సె ల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీ రెడ్డి ఆ లేఖతో కరీంనగర్ కు విచ్చేశారు.

ఈ నేపథ్యంలో నగరంలోని వి కన్వెన్షన్ లో బీజేపీ కార్పొరేటర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు మార్, బీజేపీ జిల్లా జిల్లా ఇంఛార్జీ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డికి అందజేశారు. కా ర్పొరేటర్ల సమక్షంలో డాక్టర్ మనోహర్ రెడ్డి హైకమాండ్ ఖరారు చేసిన పేర్లను కార్పొరేటర్లకు తెలియజేస్తూ వారి అభిప్రాయాలను కోరారు. 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేశ్ మేయర్ అభ్యర్ధిగా కొలగాని శ్రీనివాస్ పేరును ప్రతిపాదించగా, 62వ డివిజన్ కా ర్పొరేటర్ పెద్దపల్లి శ్రీలేఖ బలపర్చారు.

డిప్యూటీ మేయర్ అభ్యర్ధిగా సునీల్ రావు పేరును 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్ ప్రతిపాదించగా, 51వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు బలపర్చారు. బీజేపీ సీనియర్ కార్పొరేటర్లు చొప్పరి జయ శ్రీ, వాసాల రమేశ్ సహా బీజేపీ కార్పోరేటర్లందరూ కొలగాని శ్రీనివాస్, సునీల్ రావు పేర్లను మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్ధులుగా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు చప్పట్ల తో తమ ఆమోదం తెలిపారు. అక్కడి నుండి నేరుగా ప్రత్యేక బస్సులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు విచ్చేసిన కార్పొరే టర్లంతా ప్రమాణ స్వీకారం చేశారు.

ఉత్కంఠకు తెర...

కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురుతుందా, లేదా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంటుందా అన్న ఉత్కంఠకు తెరపడింది. టిఆర్‌ఎస్ తటస్థంగా వ్యవహరిం చడంతో బిజెపి పార్టీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకున్నాయి. బిజెపి మేయర్ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ 34 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కార్పొరేటర్లు అనూహ్యంగా ఆకుల నర్మద పేరును ప్రతిపాదించగా మజ్లిస్, ఏఐఎఫ్ బి కార్పొరేటర్లు మద్దతు ఇచ్చారు. ఆకుల నర్మద 22 ఓట్లకే పరిమితం అయిం ది. డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, మజ్లిస్ డిప్యూటీ మేయర్ అభ్యర్ధి హీనా అఫ్రీన్ కు 22 ఓట్లు వచ్చాయి.