22 July, 2026 | 1:47 AM

టాప్ ప్లేస్‌లో శృంగేరి రాయ్

22-07-2026 12:38 AM

సికింద్రాబాద్ క్లబ్ జీఎంఆర్ స్పోర్ట్స్ యూత్ ఓపెన్ రెగట్టా

హైదరాబాద్, జూలై 21 : జీఎంఆర్ స్పోర్ట్స్ 6వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీలు హుస్సేన్ సాగర్ వేదికగా ఉత్సాహం గా జరుగుతున్నాయి. వర్షంలోనూ యువ సెయిలర్లు హోరాహోరీగా తలపడ్డారు. ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ బాలుర విభాగంలో బి.రవి కుమార్ అగ్రస్థానంలో నిలవగా, ఆంటోనీ, సామాన్యు తర్వాతి స్థానాల్లో నిలిచారు. అటు ఆప్టిమిస్ట్ బాలికల విభాగంలో సికింద్రాబాద్ క్లబ్ కు చెందిన శృంగేరి రాయ్ అగ్రస్థానంలో నిలిచింది.

షేక్ రమీజా బాను, శ్రిష్టి తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఆప్టిమిస్ట్ గ్రీన్ ఫ్లీట్ బాలుర విభాగంలో ఆదిత్య, సమర్థ్ , శివకుమార్ మొ దటి ౩ స్థానాలు దక్కించుకున్నారు. ఆప్టిమిస్ట్ గ్రీన్ బాలికల విభాగం లో రోషిణి అగ్రస్థానం సాధించగా, ఆన్యారెడ్డి, సింధు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

ఐఎల్‌సీఏ 6 బాలుర విభాగంలో అమర్ జైస్వాల్, బాలికల విభాగంలో తులసి పట్లే, ఐఎల్‌సీఏ 4 బాలుర విభాగంలో రాహుల్ సోనార్ , బాలికల విభాగంలో తులసి పట్లే అగ్రస్థానంలో నిలిచారు. 420 మిక్స్‌డ్ విభాగంలో బద్రినా థ్ నిరుదు జోడీ టాప్ ప్లేస్‌లో నిలిచింది.

చంద్రలేఖ జోడీ రెండో స్థానంలోనూ, శిరీష ౩వ స్థానంలోనూ నిలిచారు. అజయ్ పటేల్, అర్జున్ ప్రదీపక్(కమాడోర్) రేస్ ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తున్నారు.సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ , ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ సహకారంతో, యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆమోదంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.