14 July, 2026 | 5:05 PM

Breaking News

ఆరోగ్య సంరక్షణకు అధునాతన ఆవిష్కరణలు   •   అబాకస్ పోటీల్లో రాష్ట్ర స్థాయి విజేతలుగా బ్లూ బెల్స్ విద్యార్థులు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు   •   20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •  

వసంత మాసం వస్తుంది!

02-03-2026 02:08 AM

వసంత మాసం వస్తుంది

విరహాల ముసుగులు తొలగిస్తుంది

చెమ్మచెక్కిన నేలపై

పచ్చని చిరునవ్వులు చిందిస్తుంది

మామిడి పూతలు, పిందెలు

ఫలాలు ఆశలులేపి నోరూరిస్తాయి

కోయిల కూతలు

మనసుల తాళాలు తట్టుతుంది

మల్లె పూల పరిమళం

మౌనంగా మాటలాడుతుంది

సాయంత్రపు గాలిలో

మనసులను మత్తెక్కిస్తుంది

ఎండలు పెరిగి నవ్వుతాయి

చల్లని గాలి పారిపోతుంది

ఎండిపోయిన ఆశల కొమ్మలపై

కొత్త పూతలు చిగురిస్తాయి 

పూల తోటల పల్లవాలు

రంగుల కలల్ని నింపుతాయి

మనసు నిండా ఉల్లాసాన్ని

వసంతం వర్షంలా కురిపిస్తుంది

జీవితానికే పునర్జన్మనిచ్చేలా

వసంత మాసం వస్తుంది

హృదయాల అంచుల్లో

ఆనంద దీపాలు వెలిగిస్తుంది.

 గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్