"సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
హుజుర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు
నేరేడుచర్ల,(విజయక్రాంతి): ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంను సమర్థవంతంగా, ఎటువంటి అలసత్వం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని హుజుర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు బిఎల్ వో లకు సూచించారు. నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని రామాపురం 34, 35 పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని తహసీల్దార్ సైదులుతో కలిసి ఆదివారం నాడు పరిశీలించారు.
అధికారులు ఓటర్ల నుంచి వినతులు స్వీకరించి, సందేహాలకు సమాధానాలు అందిస్తూ సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.పోలింగ్ బూత్‌లలో జరుగుతున్న నమోదు ప్రక్రియ, ప్రజలకు అందుతున్న సేవలు, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలను పరిశీలించారు.






