మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక
టేకులపల్లి, (విజయక్రాంతి): మద్రాస్ తండా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమిటీ ఎన్నిక ఆదివారం ఘనంగా జరిగింది. సర్పంచ్ మాలోత్ గంగ్లీ, ఉపసర్పంచ్ జర్పుల లింగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు పార్టీ కండువాలు కప్పి అభినందించారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కోరం సురేందర్ సూచించారు.
గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కేలోత్ రాజేష్, ఉపాధ్యక్షులుగా కర్ప నర్సింహారావు, బానోత్ వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా జర్పుల భద్రం, కార్యదర్శిగా భూక్యా సాములు, కోశాధికారిగా శెట్టిపెల్లి నర్సింహారావు, ప్రచార కార్యదర్శిగా బానోత్ రాంబాబు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా చందర్, సంతోష్, మహేష్, సురేష్, సూక్కో, రమేష్, ఆదినారాయణ, చిన్న సోమ్లా, వీరన్న, సుధీర్ ఎన్నికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకుడు ఈది గణేష్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.






