26 August, 2026 | 9:52 AM

14 సంవత్సరాల బాలికలకు ప్రత్యేక టీకా

26-08-2026 08:48 AM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): 14 సంవత్సరాల బాలికలకు ప్రత్యేక టీకాలు వేసినట్లు మతమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు  శరత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని బాలికల పాఠశాలలో 14 సంవత్సరాల బాలికలకు హెచ్పివి, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారణకు టీకాలు వేసినట్లు మతమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సుమారు 25 మంది బాలికలకు టీకాలు వేసినట్లు ఆయన తెలిపారు. పట్టణంలోని పలు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో 14 సంవత్సరాల బాలికలకు హెచ్పీవీ,(ఉమెన్ పాపిలోమా వైరస్) టికాలనీ వేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి, నర్సింగ్ చౌహన్, సూపర్వైజర్ రాణి ఏఎన్ఎం ఇందిరా సునీత ఆశ లావణ్య పాఠశాల ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు.