24 April, 2026 | 11:59 AM

Breaking News

అడవిలో వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి   •  

ముమ్మరంగా ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్

10-10-2025 12:13 AM
  1. వెయ్యి టన్నులకు పైగా చెత్త, 365 టన్నుల శిథిలాల తొలగింపు
  2. పారిశుద్ధ్యం, రహదారి భద్రతపై కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా, సురక్షితంగా మార్చే లక్ష్యంతో జీహెఎంసీ డబుల్ యాక్షన్ చేపట్టింది. ఓ వైపు నగరాన్ని చెత్తరహితంగా మార్చేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ను ఉధృతం చేయగా, మరోవైపు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రోడ్ సేఫ్టీ డ్రైవ్ ను ముమ్మరం చేసింది. ఈ రెండు కీలక కార్యక్రమాల అమలు తీరుపై జీహెఎంసీ కమిషనర్ ఆర్.వీ కర్ణన్ గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, కీలక ఆదేశాలు జారీ చేశారు.

కాగా నగరాన్ని మరింత పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో ఈ నెల 6న ప్రారంభమైన ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ నాలుగో రోజైన గురువారం కూడా ముమ్మరంగా కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ ఆర్‌వీకర్ణన్, అదనపు కమిషనర్  రఘు ప్రసాద్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గడిచిన మూడు రోజుల్లోనే నగరంలోని 695 కాలనీల్లో ఈ డ్రైవ్‌ను అమలు చేసి, రికార్డు స్థాయిలో 1082.5 మెట్రిక్ టన్నుల చెత్తను, 365 మెట్రిక్ టన్నుల నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.

వర్షాలు తగ్గుముఖం పట్టినందున రోడ్ సేఫ్టీ డ్రైవ్‌ను ముమ్మరం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నగరంలో ట్రాఫిక్ జామ్‌లు తలెత్తకుండా ఉండేందుకు, రోడ్లపై ఉన్న గుంతలన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూడ్చివేయాలి అని ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ హుకుం జారీ చేశారు.