20 July, 2026 | 7:35 PM

Breaking News

పాఠశాలకు వాటర్ ప్లాంట్ విరాళం   •   కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి   •   నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •  

వర్షాల కోసం ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

20-07-2026 01:33 AM

అలంపూర్, జూలై 19:వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ  మానవపాడు మండల కేంద్రంలోని ముస్లిం మైనారిటీ సోదరులు ఆదివారం గ్రామ శివారులో ప్రత్యేక ప్రార్థనలు (సలాతుల్ ఇస్తిస్కా) నిర్వహించారు. గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఒకచోట చేరి అల్లాహ్ను ప్రార్థించారు.ఈ సందర్భంగా ఇమామ్ వర్షాల ప్రాముఖ్యత, ప్రకృతి సమతుల్యత, రైతుల సంక్షేమం గురించి సందేశం అందించారు.

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ప్రత్యేక దువా చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు  గ్రామస్తులు పాల్గొన్నారు.