20 July, 2026 | 7:35 PM

Breaking News

పాఠశాలకు వాటర్ ప్లాంట్ విరాళం   •   కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి   •   నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •  

వరుణుడి కోసం కృష్ణా జలాలతో గ్రామదేవతలకు అభిషేకం

20-07-2026 01:34 AM

అయిజ, జులై 19: అయిజ మండలంలోని యాపదిన్నె గ్రామంలో వర్షం కోసం రైతులంతా కలసి ఎడ్లబండ్లతో బీచుపల్లి వెళ్లి అక్కడి ఆంజనేయ స్వామికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అనంతరం కృష్ణానదిలోని పవిత్ర జలాలతో యాపదిన్నె గ్రామానికి వచ్చి ఆ జలాలతో గ్రామంలోని ఆంజనేయస్వామి, మహాశివుడు, చెన్నకేశవ స్వామి అభిషేకాలు నిర్వహించారు. భారీగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి వరుణ దేవుని కోరామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.