1 August, 2026 | 9:59 PM

ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు

01-08-2026 09:00 PM

కోరుట్ల రూరల్,(విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను రైతులకు అవగాహన కల్పించారు. శుక్రవారం మండలంలోని ఐలాపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభలో అవగాహన కల్పించారు. ఎంపీడీవో  రామకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఎల్ నీనోను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, అలాగే తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణ చర్యలను విస్తృతంగా చేపట్టాలని  తెలిపారు.

వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, బోర్ రీచార్జ్ పిట్లు, కమ్యూనిటీ సోక్‌పిట్లు వంటి నీటి సంరక్షణ పనులను ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని సూచించారు. రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకుని పంట నష్టాలను తగ్గించుకోవాలని వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ద్యావనపెళ్లి రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి అని కచ్చితంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.