ఖమ్మం రైల్వే స్టేషన్ రోడ్డు వెడల్పు పనులను రాజకీయాలకు అతీతంగా వెంటనే పూర్తి చేయాలి
01-08-2026 09:27 PM
రఘనాథపాలెం,(విజయక్రాంతి): ఒక వైపు రోడ్ వెడల్పు కు అడ్డుగా ఉన్న ప్రజా ప్రతినిధి బిల్డింగ్ వ్యవహారంపై నగర ప్రజలకు కార్పొరేషన్ కమిషనర్ సమాధానం చెప్పాలని ప్రభుత్వ నిబంధనల అణుగుణంగా అవసరమైన వారికి నష్టపరిహారం ఇవ్వాలని ప్రయాణికులకు, ట్రాఫిక్ కు, ప్రజలకు ఇబ్బందిగా వున్న రైల్వే స్టేషన్ రోడ్ వెడల్పు పనులను అధికార పార్టీ నేతలు, కమిషనర్ జోక్యం చేసుకుని వెంటనే పూర్తి జరిగేలా చర్యలు తీసుకోవాలి. రోడ్ పరిశీలన సందర్భంగా CPM పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ డిమేండ్ చేసిన్నారు






