ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్, జూలై 19 : ఓటు హక్కు క లిగిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొన్ని మాణిక్ రావు అన్నారు. ఆది వారం మొగుడంపల్లి మండలంతో పాటు వి విధ గిరిజన తండాలలో ఆయన పర్యటించి ఎస్ ఐ ఆర్ పైన సమీక్ష నిర్వహించారు. బూత్ లెవెల్ అధికారులతో బూత్ లెవెల్ ఏజెంట్లు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పిపోకుండా ఓటర్ లిస్టులో నమోదు చేసేందుకు పాటుపడాలని ఆయన పేర్కొన్నారు.
మన్నాపురం జాంబోర్ తండా, మిర్జంపల్లి తండా, మొడంపల్లి గ్రామాలలో ఆయన పర్యటించారు. ఎమ్మెల్యేతో పాటు జహీరాబాద్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, జరాసంగం అధ్యక్షుడు వెంకటేశం, మొగుడంపల్లి అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయకులు గోపాల్, సురేష్, ఈశ్వర్ రెడ్డి, సంజీవ్ పవర్, తిమోతి, దేవిదాస్ జాదవ్, నాగిరెడ్డి ,ఈశ్వర్ అంజన్న, సంజీవ్ రాథోడ్, రామ్ శెట్టి, లింభాజీ, చందర్, అర్జున్, పాటిల్ రాములు, షికారి గోపాల్, జట్టప్ప బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.






