14 July, 2026 | 3:33 PM

Breaking News

దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •  

పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

10-10-2025 11:46 PM

జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి

నకిరేకల్,(విజయక్రాంతి): ఉపాధ్యాయులు పదవ తరగతి చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి అన్నారు. శుక్రవారం మండలంలోని చెరువు అన్నారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అమలవుతున్న లక్ష్య కార్యక్రమాన్ని, గుణాత్మక విద్య అమలుపై సమీక్ష నిర్వహించారు.

తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల పాఠ్యపుస్తకాలను చదివించి వారి పఠనా సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకొని వారి సందేహాలను నివృత్తి చేసి వారు విద్యలో ముందుకు వెళ్లే విధంగా కృషి చేయాలని సూచించారు.ప్రాథమిక పాఠశాలలో అమలవుతున్న ఎఫ్‌.ఎల్‌.ఎన్‌ కార్యక్రమాన్ని తనిఖీ చేసి, విద్యార్థుల నేర్చుకునే స్థాయిని అంచనా వేశారు.