12 July, 2026 | 5:40 PM

Breaking News

పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •   ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   •  

హుజూర్ నగర్ డివిజన్ లో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

17-12-2025 02:04 PM

హుజూర్ నగర్: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ అన్నారు. మూడో విడతలో హుజూర్ నగర్ డివిజన్ లోని చింతలపాలెం, మేళ్లచెరువు, హుజూర్ నగర్, మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ... పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ఘటనలకు తావులేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్పీ వెంట సిఐ చరమంద రాజు, ఎస్సై మోహన్ బాబు,తహసిల్దార్ కవిత, తదితరులు పాల్గొన్నారు.